కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NZB : కమ్మర్‌పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామ పంచాయతీలో గురువారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ జీ.ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాకేష్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకం ఒక వరమని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.