గంజాయి మాఫియాను అరెస్టు చేయాలని నిరసన

గంజాయి మాఫియాను అరెస్టు చేయాలని నిరసన

W.G: నెల్లూరులో ప్రజానాట్యమండలి నాయకుడు పెంచలయ్యపై గంజాయి మాఫియా దాడి చేసిన ఘటన పట్ల తణుకు సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలియజేశారు. ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో తణుకు అమరవీరుల భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఎం తణుకు పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ కుమారి మాట్లాడుతూ.. పెంచలయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.