రేపు జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాక

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లాకు చేరుకుంటారని పేర్కొన్నారు. 2: 30 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారని వివరించారు.