VIDEO: సింహాచలంలో 13న సాన ముహూర్తం
VSP: సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 20న అక్షయ తృతీయ చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి సమర్పించే పవిత్ర గంధాన్ని తీయడానికి “సాన ముహూర్తం” 13న నిర్ణయించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.