స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల తెలిపారు. రెండు విడుతల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.