GHMC వాట్సప్.. గంటల్లో పరిష్కారం..!

HYD: గ్రేటర్ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు GHMC ద్వారా అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ప్రతి పౌరుని వద్దకు సేవలు అందించాలనే నేపథ్యంలో జీహెచ్ఎంసీ వాట్సాప్ సేవలను తీసుకొచ్చింది. గంటల్లో పరిష్కారం చూపుతామని తెలిపింది. మీ ప్రాంతంలో రోడ్ల పక్కన నిర్మాణ వ్యర్ధాలు, గార్బేజి సమస్యలు ఉంటే 8125966586కి ఒక్క మెసేజ్ చేస్తే చాలని పేర్కొంది.