VIDEO: పెళ్లి వేడుకల్లో విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి
JN: రఘునాథపల్లి మండలం కోమల గ్రామానికి చెందిన బిక్షపతి (30) చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరై విషాదకరంగా మృతి చెందాడు. సోమవారం ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. దీంతో కోమల గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.