బీఆర్ఎస్ ఆధ్వర్యంలో "రైతు ధర్నా"

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  "రైతు ధర్నా"

మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "రైతు ధర్నా" కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలు ఫాల్గొని రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తిగా రుణ మాఫీ, సన్న వడ్లకు ₹500 బోనస్, రైతు భరోసా నిధుల విడుదల చేసి హామీలను నిలబెట్టుకోవాలన్నారు.