ఉచిత వైద్య శిబిరం, 350 మందికి పరీక్షలు

NTR: గంపలగూడెం మండలంలో ఆదివారం వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరిగింది. వైద్యులు హరీష్, కార్తీక్, దుర్గాప్రసాద్, పద్మావతి పాల్గొని 350 మందికి ఎముకలు, కీళ్ళు, జనరల్, స్త్రీ సంబంధిత వ్యాధులను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వికాస తరంగిణి అధ్యక్షురాలు సముద్రాల జ్యోతి, ఉపాధ్యక్షురాలు వెచ్చా సుధారాణి ఏర్పాట్లను పరిశీలించారు.