తొక్కిసలాట.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

తొక్కిసలాట.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

ATP: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటన హృదయాన్ని కలచివేసిందని అన్నారు.