ఘోర రైలు ప్రమాదం.. 80 మందికి గాయాలు

ఘోర రైలు ప్రమాదం.. 80 మందికి గాయాలు

స్లోవేకియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పెజినోక్-బ్రాటిస్లావా మధ్య మార్గంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.