తాడికొండలో సస్పెన్షన్ వేటు

తాడికొండలో సస్పెన్షన్ వేటు

GNTR: తాడికొండ ఎంఆర్వో పి. మెహర్ కుమార్, ఆర్‌ఐ ఎన్. హనుమంతరావు, తాడికొండ-3 స్వర్ణ గ్రామం వీఆర్వో టి. బ్రహ్మయ్య, తాడికొండ-4 స్వర్ణ గ్రామం వీఆర్వో రాంబాబులను కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా, లోపభూయిష్టంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇలాంటి తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.