జిల్లాకు భారీ వర్ష సూచన.!
నిజామాబాద్ జిల్లాకు వాతవరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నేడు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది. గంటకు 41-61 పైగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈసందర్భంగా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వెంటనే స్పందించాలని సూచనలు చేసింది.