త్వరలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

త్వరలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

NRML: త్వరలోనే జిల్లాలో సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులు తమ పంట ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవద్దని ఆమె సూచించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని తెలిపారు. పంటల అమ్మకం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.