నేడు పుంగనూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుండి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మునస్వామి మొదలియార్ తెలిపారు. మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్, శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.