ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ మొబైల్ వ్యాన్ నేరాలు జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా కేసుల విచారణ వేగవంతంగా సాగుతుందని ఆయన తెలిపారు.