'కొత్త భూమి కొట్టేది లేదు.. పాత భూమి వదిలేది లేదు'

'కొత్త భూమి కొట్టేది లేదు.. పాత భూమి వదిలేది లేదు'

MLG: కన్నాయిగూడెం మండలంములకపల్లి గ్రామంలో వలస ఆదివాసుల భూములను తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం పరిశీలించింది. రాష్ట్ర కమిటీ సభ్యుడు జజ్జర దామోదర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పోడు సాగు చేస్తున్న 26 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయడం ఆపాలని, లేనిపక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.