ముమ్మిడివరంలో పాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
కోనసీమ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ చంటి దొర (డేనియల్ కెనడీ) పై ముమ్మిడివరం పోలీసులకు జనసేన, బీజేపీ, హిందూ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. కోనసీమలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనాతవరంలో ఓ చర్చిలో పాస్టర్ చంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.