ఆలయ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

ఆలయ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

ప్రకాశం: పామూరు పట్టణంలోని పామూరు-నెల్లూరు హైవేకు పక్కనే ఉన్న శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామి ఆలయ భూమి 1.97 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఈవో నరసింహా బాబు ఆలయ భూమిని ఆక్రమించి వేసిన ఫెన్సింగ్‌ను శనివారం తొలగించారు. అంతేకాకుండా భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఈవో ఫిర్యాదు చేశారు.