ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఏలూరు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ నేటి పర్యటన వివరాలను ఎంపీ క్యాంపు కార్యాలయం శనివారం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఏలూరులోని ఏటిగట్టు యాదవ సంఘం నిర్వహించే శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో ఎంపీ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు చల్ల చింతలపూడి, 11:30 గంటలకు తంగెళ్ళమూడిలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయాలలో నిర్వహించే శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొననున్నారు.