VIDEO: అగ్ని ప్రమాదం.. రెండు తాటాకు ఇల్లులు దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదం.. రెండు తాటాకు ఇల్లులు దగ్ధం

E.G: గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని సామాగ్రి, నిత్యావసరాలు కాలిబూడిదయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.