'ఆరు నెలల బకాయిల విడుదల పట్ల హర్షం'

GNTR: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పెండింగ్‌లో ఉన్న 7నెలల బకాయిల్లో ఆరు నెలల బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు టీ.ప్రవళిక పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, సీహెచ్ఓ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.