గిట్టుబాటు ధరపై ప్రభుత్వం నిబద్ధత: ఎంపీ చామల
NLG: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా కవర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.