మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
SKLM: సారవకోట మండలం అలుదులో కె. శంకరరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శంకరరావు శుక్రవారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడగగా ఆమె నిరాకరించింది. తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు SI అనిల్ కుమార్ తెలిపారు.