నల్లమల అడవిలో పెద్దపులి ప్రత్యక్షం
TG: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో పెద్దపులి సంచారం పర్యాటకులను అలరించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని గుండం తొవ్వ సమీపంలో సఫారీ వాహనాలకు పులి తారసపడింది. అడవిలో పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా, పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పర్యాటకులు పులిని చూసి థ్రిల్ అయ్యారు.