VIDEO: పేకాట స్థావరంపై దాడి.. 8 మందిపై కేసు

VIDEO: పేకాట స్థావరంపై దాడి.. 8 మందిపై కేసు

SRD: పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గా రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కంగ్టి శివారులోని ఓ పత్తి చేనులో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో వెళ్లి చూడగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకున్నామన్నారు. పేకాట ఆడిస్తున్న సచిన్ తో కలిపి 8 మంది నుంచి రూ.47, 820 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు