'కుళ్లిన చేపలు విక్రయిస్తే కఠిన చర్యలు'

'కుళ్లిన చేపలు విక్రయిస్తే కఠిన చర్యలు'

ASR: వారపు సంతలో కుళ్ళిన చేపలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెసా కమిటీ హుకుంపేట మండల అధ్యక్షుడు శంకరరావు హెచ్చరించారు. శనివారం పెసా కమిటీ కార్యదర్శి వెంకటరమణ, సెక్రటరీ జయరాంతో కలిసి హుకుంపేట వారపు సంత సందర్శించి చేపల దుకాణాలు తనిఖీ చేశారు. కుళ్లిన చేపలు స్వయంగా తొలగించి, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.