17 మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం

PLD: తన పాలనలో వైద్య, విద్యను జగన్ వ్యాపార వస్తువుగా మార్చారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చిలకలూరిపేటలో ఆదివారం ఒక సమావేశంలో మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా 17 మెడికల్ కాలేజీలు తానే కట్టించినట్లు, రాష్ట్రానికి కొత్తగా వైద్య విద్యను పరిచయం చేసినట్లు దుష్ప్రచారం చేసుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు.