పొలం బాట పట్టిన సొసైటీ సిబ్బంది
W.G: నరసాపురం మండలం కొప్పర్రు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాట పట్టారు. సొసైటీ ఛైర్మన్ అందే నరీన్ ఆదేశాల మేరకు తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కొప్పర్రు సొసైటీ పరిధిలోని వరి పంట పొలాల్లోకి వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడి, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.