పీజీఆర్ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు - పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనేక మంది అర్జీదారులు తమ ఫిర్యాదులతో హాజరయ్యారు. వారి సమస్యలను విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు.