చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి
TG: HYDలోని పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు పెరిగిపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తులో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని మండిపడ్డారు. కేరళ ఫైల్స్ సినిమా స్టయిల్‌లో HYD ఫైల్స్ మూవీ జరుగుతోందని తెలిపారు. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాతబస్తీ అరాచకాలకు ఎంఐఎం అండదండలున్నాయని పేర్కొన్నారు.