మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రగతి కనిపిస్తుంది: MLA
PLD: మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో ప్రగతి కనిపిస్తూ ఉంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్త్ నారి-స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నట్లు చెప్పారు.