'రామారావు హంతకులను అరెస్ట్ చేయాలి'
KMM: చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నేత సామినేని రామారావును హతమార్చిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన రామారావు కుటుంబీకులను పరామర్శించాక మాట్లాడారు. ఘటన జరిగిన 13 రోజులైనా పోలీసులు నిందితుల జాడ కనిపెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు.