ఇంఛార్జ్ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన సాయినాథ్ రెడ్డి
WNP: జిల్లా డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాసులు బదిలీపై నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆర్ఎంవోగా వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో డాక్టర్ సాయినాథ్ రెడ్డిని ఇంఛార్జ్ డీఎంహెచ్‌వోగా నియమిస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో డాక్టర్ సాయినాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.