ఆలయాల వద్ద పటిష్ట భద్రతకు చర్యలు: ఎస్పీ

ఆలయాల వద్ద పటిష్ట భద్రతకు చర్యలు: ఎస్పీ

E.G: కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల ఘాట్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నర్సింగ్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాలలో భద్రతా దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.