బిచ్కుంద డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.