వీరులపాడు అంబేడ్కర్ చిత్రపటం ఊరేగింపు

NTR: వీరులపాడు మండల పరిధిలో సోమవారం వాడవాడల అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. అల్లూరు, జుజ్జూరు గ్రామంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సైతం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.