వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

SKLM: సారవకోట మండలం చీడిపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో 750 గ్రాముల వెండి ఆభరణాలు, 8 కిలోల ఇత్తడి వస్తువులను తీసుకెళ్లారు. ఇవాళ గమనించిన ఆలయ అర్చకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై బీ.అనిల్ కుమార్ తెలిపారు.