ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: MLA
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BJP గెలుపు ఖాయమని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ కాలనీలో ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి BJP అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.