పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోదండరామయ్యకు పట్టు వస్త్రాలు

KDP: ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2గంటలకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో TTD లాంఛనాలతో సీతారాముల కళ్యాణానికి108 పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామదాసు వెంకట్ తెలిపారు.