అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

SRPT: హోటల్ నిర్వాహకులు అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన, ప్రతి అంతస్తులో ఎస్కేప్ ప్లాన్ ఉండాలని, ఏసీ డ్యాంపర్లను ఆటోమేటిక్ సిస్టమ్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.