కంభంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

కంభంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో పంట సాగు చేసిన రైతులు అందరూ పంట నమోదు చేయించుకోవాలన్నారు. అనంతరం శనగ పంటలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు.