'సురక్షితమైన వాతావరణం కల్పించడానికి శక్తి వారియర్స్ దోహదం'

VZM: సురక్షితమైన వాతావరణం కల్పించడానికి శక్తి వారియర్స్ టీమ్స్ దోహదపడతాయని ఎస్సై గణేష్ చెప్పారు. నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క తరగతికి శక్తి వారియర్ టీమ్‌ను ఏర్పాటు చేసి కళాశాల స్థాయిలో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం శక్తి వారియర్స్, టీమ్ లీడర్ల పాత్ర, బాధ్యతలను ఎస్సై వివరించారు.