సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
VZM: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు అన్నారు. మంగళవారం ఆయన తన సిబ్బందితో కలిసి డెంకాడ మండలం పిన్నవలసలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు, ప్రజలు దూరంగా ఉండాలని హితవు పలికారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.