పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఛైర్మన్

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఛైర్మన్

ఏలూరు జిల్లా పోలవారం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణ పనులు కీలకమైనవని, నాణ్యతపై దృష్టి సారించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ పద్మ డోర్జే గ్యాంబా అన్నారు. ఆయన మంగళవారం పోలవరం  ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం గ్యాంబాను పీపీఏ సీఈవో సంజీవ్ ఓహ్రా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.