విచారణకు హాజరైన వైసీపీ నేత
KRNL: బస్సు ప్రమాద సంఘటనకు కల్తీ మద్యం కారణమని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన, కల్తీ మద్యం, బెల్టు షాపులపై జరిగిన ప్రచారానికి సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు.