47 మంది విద్యార్థులకు అస్వస్థత

AP: BC హాస్టల్‌లో 47 మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురవడం గుంటూరు జిల్లా పెదనందిపాటు మండలంలో కలకలం రేపింది. స్థానిక అన్నపర్రు గ్రామంలోని హాస్టల్‌లో 106 మంది విద్యార్థులు ఉంటుండగా, కొందరు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వారిని గ్రామంలోని PHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నతాధికారులు హాస్టల్‌ని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు.