అర్ధరాత్రి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
VSP: తుఫాను ప్రభావం నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఐఏఎస్ సోమవారం అర్ధరాత్రి నగరంలో విస్తృతంగా పర్యటించారు. టౌన్ కొత్త ప్రాంతాల్లో విరిగిపడిన, వాలిపోయిన చెట్లను తొలగించి, తరలించే ప్రక్రియను ఆయన స్వయంగా పనిపర్యవేక్షించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ సిబ్బంది, పోలీసులతో మాట్లాడిన కమిషనర్, విరిగిపడిన చెట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.