'పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది'
JGL: పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. శనివారం రాయికల్ మండలం ధర్మాజీపేటలో నూతనంగా నిర్మించిన మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఆ ఇంటి ఆడబిడ్డ సరస్వతికి చీరసారెను అందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న మిగితా ఇండ్ల నిర్మాణంలోనూ వేగం పెంచాలని జీపీవోను ఎమ్మెల్యే ఆదేశించారు.