"ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి"
HNK: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ DGP శివధర్ రెడ్డి ప్రారంభించిన 'అరైవ్ అలైవ్'లో భాగంగా మడికొండ పోలీసులు మంగళవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే చట్టా రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.